Wed Jan 28 2026 17:42:26 GMT+0000 (Coordinated Universal Time)
నాగు పాము కత్తిని మింగేస్తే?
కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది.

కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది. గణపతి నాయక్ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న కత్తిని పాము మింగింది. కత్తి పిడి భాగం మాత్రం బయటే ఉంది. పాము కత్తిని పూర్తిగా మింగలేక, ముందుకు కదల్లేక నరకయాతన అనుభవించింది. దీనిని గమనించిన ఆ కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న వెటర్నరీ వైద్యుడు భట్‌కు, స్నేక్ క్యాచర్ కు కూడా సమాచారమిచ్చారు. పాము నోట్లో నుంచి డాక్టర్ కత్తిని బయటకు తీశారు. కత్తి తీసిన తర్వాత నాగుపాము కాస్త తేరుకుంది. ఊపిరితో ఉన్న ఆ నాగుపామును స్నేక్ క్యాచర్ సమీప అడవిలో విడిచిపెట్టారు. పామును కాపాడిన ఈ బృందానికి ప్రశంసలు దక్కుతున్నాయి.
Next Story

