Fri Dec 05 2025 12:23:20 GMT+0000 (Coordinated Universal Time)
టైటిల్ కొట్టడానికి వచ్చాం: బంగ్లాదేశ్ కోచ్
బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ టీమిండియాను ఓడించడం అంత కష్టం కాదని చెప్పారు.

బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ టీమిండియాను ఓడించడం అంత కష్టం కాదని చెప్పారు. తమ జట్టు ఉత్తమ ఆటతీరును కనబరిస్తే వారిని గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిమ్మన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు కావచ్చు, కానీ తాము గెలవలేమన్నది నిజం కాదన్నారు. ప్రతి జట్టుకు భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉంటుందని, మేము మా శక్తి మేరకు ఆడితే తప్పులు రాబట్టి, మ్యాచ్‌ను మలుపు తిప్పగలమన్నారు. తాము శ్రీలంకను ఓడించేందుకు మాత్రమే కాదు, ఆసియా కప్ టైటిల్ గెలవడానికి వచ్చామన్నారు.
Next Story

