Fri Dec 05 2025 14:23:49 GMT+0000 (Coordinated Universal Time)
వినయ్ నర్వాల్ భార్య ఫేక్ పోస్టులు చేస్తూ దొరికిపోయారు
జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి

జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన భారత నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య ను కొందరు టార్గెట్ చేశారు. ఆమె లాగే ఉన్నట్లుగా మార్ఫింగ్, AI-జనరేటెడ్ వీడియోను సృష్టించి, వైరల్ చేసినందుకు ఇద్దరు సైబర్ నేరస్థులను బీహార్ లో అరెస్టు చేశారు. నిందితులను ధోబ్వాలియా గ్రామానికి చెందిన మోహిబుల్ హక్, గులాం జిలానీగా గుర్తించారు. హర్యానా పోలీసులు గోపాల్‌గంజ్ పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. దర్యాప్తులో వారు డీప్‌ఫేక్ వీడియోను రూపొందించడానికి ఏఐను ఉపయోగించారని, దానిని యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారని తేలింది. విచారణలో వీరిద్దరూ AI- జనరేటెడ్ కంటెంట్‌తో పలువురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది.
Next Story

