Sun Sep 15 2024 00:51:04 GMT+0000 (Coordinated Universal Time)
ఎడిట్ ఆప్షన్ ను తీసుకుని వచ్చిన ట్విట్టర్.. ఎవరికోసమంటే..!
అక్షరదోషాలు, వ్యాకరణ లోపాలను పరిష్కరించడానికి ట్విట్టర్ వినియోగదారులు ఎడిట్ బటన్ కోసం
ట్విట్టర్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎడిట్ ట్వీట్ ఫీచర్‌ను తీసుకుని వచ్చేస్తోంది. సెప్టెంబర్ 21న ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. నెలకు $4.99 చెల్లించే బ్లూ సబ్స్క్రైబర్లకు మొదట అందుబాటులో ఉంటుంది. ఎడిట్ ట్వీట్ ఫీచర్ వ్యక్తులు.. సదరు వ్యక్తులు/సంస్థలు తమ ట్వీట్‌ను ప్రచురించిన తర్వాత దానికి మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. ఒకసారి ట్వీట్ చేశామంటే అందులో ఎడిట్ చేసే అవకాశం ఉండేది కాదు.. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేయడమో, లేక ముందు చేసిన ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ చేయడమో చేయాల్సి ఉంటుంది.
సవరించిన ట్వీట్లు ఐకాన్, టైమ్‌స్టాంప్, లేబుల్‌తో కనిపిస్తాయి. అంతకు ముందు చేసిన ట్వీట్ ఎడిట్ చేయబడిందని పాఠకులకు స్పష్టంగా తెలుస్తుంది. లేబుల్‌ను నొక్కడం వల్ల వ్యూవర్స్ ట్వీట్ ఎడిట్ హిస్టరీ లోకి తీసుకెళ్తుంది. ఇందులో గతంలో చేసిన ట్వీట్ వెర్షన్లు ఉంటాయి. ప్లాట్ఫార్మర్కు చెందిన కేసీ న్యూటన్ శుక్రవారం ఒక ట్వీట్లో ఈ ఫీచర్ వచ్చే వారం నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అక్షరదోషాలు, వ్యాకరణ లోపాలను పరిష్కరించడానికి ట్విట్టర్ వినియోగదారులు ఎడిట్ బటన్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రజలకు ఎడిట్ ఫీచర్‌ను అందించడానికి ముందు.. ఎడిట్ ట్వీట్ ఫీచర్ ను తన అంతర్గత బృందంతో టెస్ట్ చేయించింది ట్విట్టర్ యాజమాన్యం. అక్షరదోషాలను సరిచేయడం, ట్యాగ్‌లను జోడించడం.. వంటి వాటి కోసం ఎడిట్ ఫీచర్ ఉపయోగపడుతుందని ట్విట్టర్ భావిస్తోంది.
Next Story