Wed Jan 28 2026 20:29:58 GMT+0000 (Coordinated Universal Time)
కలిసి ప్రయాణిస్తోంది సామాన్యుడైతే కాదు
గూగుల్ మ్యాప్స్ ను నమ్మి దారితప్పడం, ప్రమాదాలకు గురయ్యే ఘటనలు చాలానే జరుగుతున్నాయి

గూగుల్ మ్యాప్స్ ను నమ్మి దారితప్పడం, ప్రమాదాలకు గురయ్యే ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ జంటకు ఊహించని ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. కేరళకు చెందిన జోసెఫ్ తన భార్యతో కలిసి కారులో వెళుతూ గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యాడు. ప్రస్తుతం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం ప్రాంతంలోని కడుతురుత్తి రోడ్లు జలమయం అయ్యాయి. జోసెఫ్, ఆయన భార్య అదే సమయంలో కారులో వెళుతున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తున్న రూట్ లోకి వచ్చి చివరికి వరద నీటిలోకి వెళ్లారు. కారు ముందు భాగం వరద నీటిలో మునిగిపోగా, వారిని స్థానికులు రక్షించారు.
Next Story

