Fri Jan 30 2026 07:08:49 GMT+0000 (Coordinated Universal Time)
విమానాశ్రయాల భద్రతకు ముప్పు: నిఘా వర్గాలు
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్‌పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.
News Summary - Threat to airport security: Intelligence sources
Next Story

