Sat Dec 13 2025 22:32:57 GMT+0000 (Coordinated Universal Time)
టెస్లా అమ్మకాలు అంతంత మాత్రమే!!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో పాగా వేయడానికి అమెరికన్ కంపెనీ టెస్లా ముందుకు వచ్చింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో పాగా వేయడానికి అమెరికన్ కంపెనీ టెస్లా ముందుకు వచ్చింది. మోడల్ వై ద్వారా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లా కంపెనీ, అక్టోబర్‌లో కేవలం 40 కార్లే అమ్మగలిగింది. ప్రస్తుతం టెస్లా ఒక్క మోడల్ వై కారునే అమ్ముతుండగా, దీని ధర 59 నుండి 67 లక్షల మధ్యలో ఉంది. దిగుమతి చేసుకుని అమ్మకాలు జరుపుతున్న టెస్లా ఇంకా స్థానికంగా అసెంబ్లింగ్ ప్రారంభించలేదు. కంపెనీ స్టోర్లు కూడా ముంబై, ఢిల్లీకే పరిమితమయ్యాయి.ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్ 18,055 యూనిట్లకు చేరుకున్నాయి. 2024 అక్టోబర్‌తో పోలిస్తే 57.5 శాతం వృద్ధి నమోదైంది. 2023 అక్టోబర్‌లో 11,464 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి.
Next Story

