రష్యా నుండి యుద్ధ నౌకను తీసుకొస్తున్న తెలుగు వ్యక్తి శ్రీధర్

జులై 1న రష్యాలో బయలుదేరింది ఐఎన్ఎస్ తమాల్ యుద్ధనౌక. అయితే ఈ యుద్ధనౌకకు సేఫ్ గా తీసుకుని వచ్చే బాధ్యతలను తెలుగు వ్యక్తి మోస్తున్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి, శ్రీకాకుళం జిల్లా వాసి కెప్టెన్ శ్రీధర్ తాతాకు ఈ అరుదైన అవకాశం దక్కింది. భారత్‌కు రానున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ తమాల్కు ఆయన తొలి కమాండర్‌గా నేతృత్వం వహించనున్నారు. యుద్ధనౌకకు మొదటి కమిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రీధర్ తాతా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చొర్లంగి గ్రామం. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన శ్రీధర్.. 26 ఏళ్లుగా వివిధ హోదాల్లో 12 యుద్ధనౌకల్లో సేవలందించారు. అందులో మూడింటికి మొదటి కమిషన్ కెప్టెన్‌గా నేతృత్వం వహించారు.
త్వరలోనే భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న ఐఎన్ఎస్ తమాల్ ను 250 మందితో కూడిన బృందం ఇక్కడకు తీసుకువస్తోంది. భారత్, రష్యా నిపుణులు సంయుక్తంగా ఈ నౌకను రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌లో నిర్మించారు. అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు, సెన్సర్లతోపాటు, రష్యా సాంకేతికత ఈ నౌకలో ఉన్నాయి.

