Fri Dec 05 2025 21:38:53 GMT+0000 (Coordinated Universal Time)
లండన్‌కు చేరాక ఫోన్ చేస్తా అంటూ తండ్రికి మాటిచ్చింది
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో క్రూ మెంబర్ మైథిలీ పాటిల్ మరణించింది.

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో క్రూ మెంబర్ మైథిలీ పాటిల్ మరణించింది. నవీ ముంబయి కి చెందిన ఆమె చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కనేది. ఆమె కలలు నిజమై ఆమె ఎయిరిండియా సిబ్బందిలో భాగమైంది. విధి నిర్వహణలో ఉండగానే ఆమె ప్రమాదంలో కన్నుమూసింది.
మైథిలీ పాటిల్ తన తండ్రి మోరేశ్వర్ పాటిల్‌కు గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్ చేసింది. లండన్ చేరుకున్నాక మళ్లీ చేస్తానంటూ చెప్పింది. ఆమె తన మాట నెరవేర్చకుండానే తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. డ్రీమ్‌లైనర్‌లో క్రూ సిబ్బందిలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో మైథిలి ఒకరు. మైథిలి రెండేళ్ల క్రితం ఎయిరిండియాలో చేరింది. ఆమె తండ్రి మోరేశ్వర్పాటిల్ ఓఎన్జీసీ లేబర్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు.
Next Story

