Fri Dec 05 2025 22:18:43 GMT+0000 (Coordinated Universal Time)
భయపెడుతున్న ఆఫ్రికన్ నత్తలు
పంటలపై ఆఫ్రికాజాతి నత్తలు దాడి చేస్తున్నాయి. ఈ నత్తల దాడిలో పంటలు, పండ్లతోటలు నాశనమవుతున్నట్లు ఉద్యానశాస్త్రవేత్తలు గుర్తించారు.

పంటలపై ఆఫ్రికాజాతి నత్తలు దాడి చేస్తున్నాయి. ఈ నత్తల దాడిలో పంటలు, పండ్లతోటలు నాశనమవుతున్నట్లు ఉద్యానశాస్త్రవేత్తలు గుర్తించారు. పలు రాష్ట్రాలలో వీటి కారణంగా రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. ఈ నత్తలు వేల సంఖ్యలో పొలాలు, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ గడ్డి, ఆకులు, లేత మొకలను తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, బత్తాయి, కోకో, పామాయిల్, బొప్పాయి, అరటి, జామతోటల్లో చెట్ల కాండాల్లోని రసాన్ని పీల్చేస్తున్నాయి. దేశంలో మొదటిసారిగా కేరళ రాష్ట్రంలో వీటి ఆనవాలు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉభయగోదావరి జిల్లాల అటవీ ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో కూడా భారీ నష్టాన్ని కలిగించాయి.
Next Story

