Fri Dec 26 2025 17:30:50 GMT+0000 (Coordinated Universal Time)
410 రూపాయల ఆవిష్కరణ పాములు, తేళ్లను పారదోలే కర్ర
పొలాల్లో రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల సమస్యలు ఉంటాయి.

పొలాల్లో రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల సమస్యలు ఉంటాయి. అయితే ఇలాంటి వాటిని తరిమేసే ప్రత్యేక కర్రను గుజరాత్లోని సర్ భావ్సింహ్జీ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి క్రిష్ దోడియా సృష్టించాడు. ఈ ఆవిష్కరణకు అతడి మిత్రుడి తోడ్పాటు కూడా ఉంది. ఈ కర్రను నేలకు తాకిస్తే ప్రకంపనలు వచ్చి పాములు, తేళ్లను పారదోలతాయి. ఈ కర్ర తయారీకి అయిన ఖర్చు కేవలం 410 రూపాయలే. దీనికి ఎల్ఈడీ బల్బును కూడా అమర్చవచ్చు. పొరపాటున ఏవైనా కాటువేసినా పక్కవారిని హెచ్చరించడానికి బజర్నూ ఏర్పాటు చేసుకోవచ్చని ఈ కర్ర సృష్టికర్తలు చెబుతున్నారు. వీరి ఆవిష్కరణకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.
Next Story

