Fri Dec 12 2025 14:21:38 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయాణీకులకు 10000 రూపాయల వోచర్లు
ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు విమానాశ్రయాల్లో ప్రజలు ఇబ్బందిపడ్డారు. అయితే ప్రయాణికులకు ఇండిగో సంస్థ ఓచర్ల రూపంలో పరిహారం ప్రకటించింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో ఇబ్బందిపడ్డ వారికి 10,000 రూపాయల చొప్పున ప్రయాణ వోచర్లను ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని ఏడాదిలో ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామన్న 5,000 నుంచి 10,000 రూపాయల పరిహారానికి ఇది అదనమని తెలిపింది. డిసెంబర్ 11న 1,950 విమాన సర్వీసులను నడిపినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది.
Next Story

