ఆర్సీబీ వల్లే 11 మంది మృతి అంటూ తేల్చారు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కారణంగానే ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తేల్చింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కారణంగానే ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తేల్చింది. ఐపీఎల్ 2025 విజయానంతరం బెంగళూరు వేదికగా ఆర్సీబీ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించగా మరో 50 మంది వరకు గాయపడ్డారు.
విచారణ చేపట్టిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిపోర్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాటకు ఆర్సీబీదే ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేసింది. పోలీసులు, సంబంధిత అధికారుల నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పిలుపునిచ్చిందని ట్రిబ్యునల్ పేర్కొంది. పోలీసులకు అతీత శక్తులు ఉండవని క్యాట్ తమ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ సస్పెన్షన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు చేసింది.

