Sun Dec 14 2025 02:41:17 GMT+0000 (Coordinated Universal Time)
70 తులాల బంగారు ఆభరణాలు తిరిగిచ్చిన రాజేశ్
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 270మందికి పైగా మరణించారు.

అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 270మందికి పైగా మరణించారు. ఈ ప్రమాద సమయంలో రాజేశ్ పటేల్ అనే వ్యక్తి మానవత్వాన్ని చాటుకున్నారు. విమానం కుప్పకూలిన విషయం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి పరుగెత్తిన ఆయన మృతదేహాలు, క్షతగాత్రులను అంబులెన్సుల్లోకి ఎక్కించారు.
శిథిలాల్లో వెతికి దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, కొన్ని అమెరికా డాలర్లు సేకరించి పోలీసులకు అప్పగించారాయన. నిర్మాణ రంగంలో వ్యాపారిగా ఉన్న రాజేశ్ పటేల్ ఎయిరిండియా విమానం కూలగానే ఒక్కసారిగా శబ్దం వచ్చిందని, ఆకాశంలోకి ఓ పెద్ద అగ్నిగోళంలా ఎగసిపడిందన్నారు. అప్పుడు తాను ఘటనా స్థలానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని కాపాడాలనే ఆశతో ఆ ప్రాంతానికి వెళ్లానన్నారు
Next Story

