Fri Dec 05 2025 11:59:06 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రపతికి తప్పిన పెనుప్రమాదం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోయింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. కొచ్చిలోని ప్రమదం స్టేడియానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో హెలికాప్టర్‌ను అతి కష్టం మీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు.
Next Story

