Fri Jan 30 2026 05:40:46 GMT+0000 (Coordinated Universal Time)
అంతరిక్షం నుండి భూమికి తిరిగొచ్చిన మన విత్తనాలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి కొద్ది రోజులపాటు అక్కడ ఉంచిన రెండు రకాల పంటలకు చెందిన విత్తనాలు భూమికి తిరిగొచ్చాయి.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి కొద్ది రోజులపాటు అక్కడ ఉంచిన రెండు రకాల పంటలకు చెందిన విత్తనాలు భూమికి తిరిగొచ్చాయి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన అత్యధిక పోషక విలువలు కలిగిన సీబక్థార్న్, హిమాలయన్ బక్వీట్ విత్తులను నాసాకు చెందిన వ్యోమగాములు ఐఎస్ఎస్కు తీసుకువెళ్లారు. క్రూ-10 మిషన్లో భాగంగా ఆగస్టు 9న తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష దేశాల స్పేస్ ఫర్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఫర్ స్పేస్ ప్రయోగాల్లో భాగంగా ఆ విత్తనాలను అంతరిక్షంలో తీసుకు వెళ్లి తిరిగి తీసుకొచ్చి వాటిపై పలు పరిశోధనలు చేపడుతున్నారు.
News Summary - Our seeds returned to Earth from space
Next Story

