మా పెళ్లి రద్దు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది.

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. అయితే, కొన్నిరోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాశ్ తో నా వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ స్మృతి తన పోస్టులో వివరించింది.
పలాశ్ ముచ్చల్ కూడా స్పందించారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తనపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదన్నారు పలాశ్.

