Fri Dec 05 2025 20:02:01 GMT+0000 (Coordinated Universal Time)
కాదేదీ దొంగతనానికి అనర్హం.. డ్రైనేజి మీదున్నా
దొంగలు డ్రెయిన్ మీద ఉంచిన ఇనుప కంచెను కూడా దొంగిలించేశారు.

దొంగలు డ్రెయిన్ మీద ఉంచిన ఇనుప కంచెను కూడా దొంగిలించేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. వీడియోలో ఇద్దరు వ్యక్తులు డ్రెయిన్ కవర్‌ను ఎత్తుతున్నట్లు చూడవచ్చు. మరొక వ్యక్తి రిక్షాలో వచ్చాడు. ఇద్దరు దొంగలు దాన్ని రిక్షాపై ఎక్కించుకుని అక్కడి నుండి పారిపోయారు. ఆగస్టు 1- ఆగస్టు 2 తేదీల మధ్య రాత్రి భారత్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని లాల్ కుయాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి ఈ-రిక్షా నంబర్ ప్లేట్‌కు ఎరుపు రంగు వేశారు.
Next Story

