Fri Dec 05 2025 13:17:20 GMT+0000 (Coordinated Universal Time)
నిఖిల్ సినిమా షూటింగ్ లో సముద్రం సీన్స్ తీస్తుండగా.. భారీ ప్రమాదం
నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.

నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్కు తీవ్ర గాయాలు అయ్యాయి.
మరికొంత మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం కలిగింది. రామ్చరణ్ సమర్పణలో నిఖిల్ - సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమే ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Next Story

