Fri Dec 05 2025 08:20:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రహ్మపుత్ర నదీజలాల్లో కొత్త జాతి చేప
బ్రహ్మపుత్ర నదీజలాల్లో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

బ్రహ్మపుత్ర నదీజలాల్లో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చతో ఉన్న ఈ చేపకు శాస్త్రవేత్తలు పేథియా దిబ్రూఘర్నేసిస్ అనే పేరుపెట్టేశారు. ఈశాన్య భారతంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీజలాల్లో ఈ మత్స్యజాతిని గుర్తించారు. దిబ్రూగఢ్ సమీప జలాల్లో ఈ మంచినీటి చేపను కనుగొన్నారు. అందుకే ఆ పేరుపెట్టారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంట ఉన్న భిన్నజాతుల చేపలు, వాటి సంతతి, వృద్ధి, ఇతర రకాల జలచరాల వివరాలను తెల్సుకునేందుకు సర్వే చేపట్టగా అధ్యయనకారులకు ఈ చేప కనిపించింది. ఈ కొత్తరకం చేప కాస్తంత భిన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Next Story

