సోషల్ మీడియాపై భారత సైన్యానికి కొత్త నిబంధనలు
భారత సైన్యం సోషల్ మీడియా వినియోగంపై కీలకమైన మార్పులు చేసింది.

భారత సైన్యం సోషల్ మీడియా వినియోగంపై కీలకమైన మార్పులు చేసింది. సైనికులు, అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించడానికి, పర్యవేక్షించడానికి ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే, దానిలో ఎలాంటి పోస్టులు పెట్టడం, లైక్‌లు కొట్టడం లేదా కామెంట్లు చేయడం వంటి కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ కొత్త ఆదేశాలను ఆర్మీలోని అన్ని యూనిట్లకు, విభాగాలకు పంపించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి సైనికులకు ఇది వీలు కల్పిస్తుంది. తప్పుడు లేదా నకిలీ పోస్టులను గుర్తిస్తే, వాటిని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా, హనీ ట్రాప్ ను నివారించడానికి, సోషల్ మీడియాపై సైన్యం కఠిన ఆంక్షలు విధించింది. 2020లో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా 89 యాప్‌లను డిలీట్ చేయాలని సైన్యాన్ని ఆదేశించింది.

