Fri Dec 05 2025 17:35:23 GMT+0000 (Coordinated Universal Time)
మంజీరా బ్యారేజీ.. మొసళ్లతో డేంజర్
మంజీరా బ్యారేజీకి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ

మంజీరా బ్యారేజీకి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ, మొసళ్లతో డ్యామ్ కు డేంజర్ పొంచి ఉందని కూడా హెచ్చరించారు. మంజీర వన్యప్రాణుల అభయారణ్యంలోని మొసళ్ళు మంజీరా బ్యారేజీకి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. డ్యామ్ దగ్గర పని చేస్తున్న వారి భద్రతకు మొసళ్లతో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. మంజీర జలాశయం చుట్టుపక్కల నుండి అన్ని మొసళ్ళను వేరే చోటుకు తరలించే అవకాశాలను అన్వేషించాలని నీటిపారుదల శాఖ అధికారులు అటవీ శాఖ అధికారులను కోరారు. మొసళ్ళు చాలా బలమైన జీవులు, వాటి దాడుల కారణంగా ఆనకట్ట గేట్లు దెబ్బతినే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆనకట్ట భద్రతా నిపుణులు చెప్పారు. దాదాపు 700 ముగ్గర్ మొసళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నాయి.
Next Story

