ఏఐ సాయంతో 150 ఏళ్లు బతకొచ్చట
ఒకానొక కాలంలో ఋషులు, మహర్షులు 100 ఏళ్లకు పైగా బతికారని చెప్పేవారు.

ఒకానొక కాలంలో ఋషులు, మహర్షులు 100 ఏళ్లకు పైగా బతికారని చెప్పేవారు. మన తాతలు, ముత్తాతల కాలంలో అయితే కనీసం 80-100 సంవత్సరాలు బతికిన వాళ్లను చాలా మందినే చూశాం. అయితే మారిన జీవనశైలి, చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అరవై-డెబ్భై ఏళ్ళు బతకడం కూడా కష్టమేనని అంటున్నారు.
అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏకంగా 150 ఏళ్లు మనిషి బతకొచ్చని అంటున్నారు. ఏఐ సాయంతో 2030 నాటికి మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వేలాది పత్రాలను సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉంది. సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను ఏఐ ద్వారా కనుగొనవచ్చు. కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందుజాగ్రత్త పడొచ్చట. శరీరంలోని క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు మన వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుందని, ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని కూడా జయించేయొచ్చు.

