Sun Jul 20 2025 05:56:09 GMT+0000 (Coordinated Universal Time)
భూమిపైకి దూసుకొస్తున్న కాంతి ఖడ్గంలా!!
వ్యోమగామి నికోల్ వేపర్ అయెర్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఓ అరుదైన ఫోటోను తీశారు

వ్యోమగామి నికోల్ వేపర్ అయెర్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఓ అరుదైన ఫోటోను తీశారు. మెక్సికో, అమెరికా మీదుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రయాణిస్తున్న సమయంలో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన తుఫానుకు కారణమయ్యే మేఘాల పై ఆవరణ మిసోస్ఫియర్లో పిడుగుపాట్లు సంభవిస్తే ఇలాంటి కాంతిపుంజాలు ఏర్పడుతుంటాయి. వీటిని ట్రాన్సియెంట్ ల్యూమినస్ ఈవెంట్ అని చెబుతుంటారు. వీటిని సాంకేతిక భాషలో స్ప్రైట్ లైట్నింగ్ బోల్డ్ అంటారు. సాధారణ పిడుగుపాట్లు మేఘాల నడుమ, లేదంటే మేఘాలకు, నేలకు నడుమ ఇవి పడుతుంటాయి. సాధారణంగా వీటిని భూమిపై నుంచి చూడడం కష్టం. అంతరిక్షం నుంచి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి.
Next Story