Wed Dec 17 2025 12:54:05 GMT+0000 (Coordinated Universal Time)
కర్రెగుట్టలు.. ఇకపై టూరిస్ట్ స్పాట్లు
మావోయిస్టుల అడ్డాగా ఉన్న కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.

మావోయిస్టుల అడ్డాగా ఉన్న కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దట్టమైన అడవి, సెలయేళ్లు, గుహలు, కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా, పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తూ ఉంది. దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మార్చాలని అనుకుంటోంది కేంద్రం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిపారు. వేసవిలోనూ ఇక్కడ ఊటీ తరహా వాతావరణం ఉంటుందని, పర్యాటకానికి కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయని చెబుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టులకు అడ్డాగా మారకుండా ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా బలగాల కోసం ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్‌లు కూడా నిర్మించబోతున్నారు.
Next Story

