Fri Dec 05 2025 15:54:51 GMT+0000 (Coordinated Universal Time)
భారత పాస్‌పోర్ట్ ర్యాంకు పతనం
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 80వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఐదు స్థానాలు దిగజారింది. భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 62గా ఉండేది. సింగపూర్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పౌరులు 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఆ తర్వాత స్థానంలో దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఉన్నాయి. చరిత్రలో తొలిసారిగా అమెరికా టాప్ 10లో చోటు కోల్పోయింది. ప్రస్తుతం మలేషియాతో కలిసి 12వ స్థానంలో ఉన్న అమెరికా పౌరులు 180 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయగలరు.
Next Story

