12 హైపర్సోనిక్ మిసైళ్లు సిద్ధం చేస్తున్న భారత్
అత్యాధునిక ఆయుధాలను భారత్ సొంతంగా తయారు చేస్తోంది.

అత్యాధునిక ఆయుధాలను భారత్ సొంతంగా తయారు చేస్తోంది. డీఆర్డీవో ఆధ్వర్యంలో వివిధ రకాల 12 హైపర్సోనిక్ మిసైళ్లు సిద్ధమవుతూ ఉన్నాయి. దాడి చేయడం, రక్షణ సామర్థ్యాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టు విష్ణులో ఈ మిసైళ్ల తయారీని ప్రధానంగా చేపట్టారు. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
అత్యాధునిక 12 హైపర్సోనిక్ ఆయుధాలను ఆర్మీ, నేవీ, వాయుసేన కోసం డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. దీనిలో మొట్టమొదటగా ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను ప్రాజెక్టు విష్ణులో భాగంగా రూపొందిస్తున్నారు. 2,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇవి ఛేదించగలవని, 2030 కల్లా సాయుధ బలగాల అమ్ములపొదిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.