Wed Jan 28 2026 20:34:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటే యాకేలో బైక్ చోరీ
ప్రపంచాన్ని చుట్టివచ్చే ఛాలెంజ్‌లో భాగంగా భారతదేశానికి చెందిన ఒక మోటార్‌సైకిలిస్ట్ యునైటెడ్ కింగ్డమ్ మీదుగా ప్రయాణిస్తుండగా అతని బైక్ ను దొంగిలించారు.

ప్రపంచాన్ని చుట్టివచ్చే ఛాలెంజ్‌లో భాగంగా భారతదేశానికి చెందిన ఒక మోటార్‌సైకిలిస్ట్ యునైటెడ్ కింగ్డమ్ మీదుగా ప్రయాణిస్తుండగా అతని బైక్ ను దొంగిలించారు. మే 1న ముంబై నుండి బయలుదేరిన యోగేష్ అలేకారి ఆసియా, యూరప్‌లోని 17 కి పైగా దేశాలలో పర్యటించాడు. యూకే నాటింగ్‌హామ్‌లోని వోలాటన్ పార్క్‌లో పార్క్ చేసినప్పుడు అతడి KTM 390 అడ్వెంచర్ మోటార్‌బైక్ ను, అతడి వస్తువులను దొంగిలించారని 33 ఏళ్ల యోగేష్ తెలిపాడు. వేలాది మంది ఫాలోవర్లకు సోషల్ మీడియాలో తన ప్రయాణం గురించి తెలియజేస్తున్న యోగేష్ తన బైక్ దొంగతనం జరగడంపై బాధను వ్యక్తం చేశారు. ఇది ఎంతో బాధాకరమైనదని, తన హృదయం విరిగిపోయిందని అన్నారు.
Next Story

