పాత నాణేలకు లక్షలు ఆశపడితే లక్షలు కాజేస్తారు
పాత నాణేలకు లక్షల రూపాయలు ఇస్తామంటూ కొత్త దోపిడీ మొదలైంది.

పాత నాణేలకు లక్షల రూపాయలు ఇస్తామంటూ కొత్త దోపిడీ మొదలైంది. సైబర్‌నేరగాళ్లు ఈ మాయమాటలు నమ్మినవారిని ఉచ్చులోకి దించి మొత్తం దోచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని రాంనగర్‌కు చెందిన ఓ 74 ఏళ్ల వృద్ధుడి నుంచి పాతనాణేలకు పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తామంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి 4 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు. ఫేస్బుక్లో ప్రకటన చూసి నాణేలకు డబ్బులు ఇస్తారని నమ్మిన బాధితుడు అందులో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. వృద్ధుడి దగ్గర ఉన్న పాతకాయిన్స్కు ఏకంగా 72లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ లాంటి వాటికి చార్జీలు ఉంటాయని చెప్పి నమ్మించారు. బాధితుడు నేరగాళ్లు సూచించిన అకౌంట్‌కు 28సార్లు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత నేరగాళ్లు స్పందించడం మానేశారు. 20 రూపాయల నాణానికి 50లక్షలు ఇస్తామంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చి దరూల్షిఫాకు చెందిన ఒక వృద్ధుడిని కూడా మోసం చేశారు. 2లక్షల రూపాయలు అతడి నుండి దోచేశారు.

