Fri Dec 05 2025 11:16:45 GMT+0000 (Coordinated Universal Time)
తవ్వితే బంగారం.. భలే దొరికింది
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు. మహాగ్వాన్ కియోలరి ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్టు కనిపెట్టారు. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భాగంగా చేసిన మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని శాస్త్రవేత్తలు జాతీయ మీడియాకు చెప్పారు. ఆ భూముల్లో బంగారంతోపాటు రాగి, మరిన్ని విలువైన లోహాలు కూడా ఉన్నాయి. మహాగ్వాన్ కియోలరి ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇనుము, మాంగనీసు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి వెలికితీసిన ఇనుము, మాంగనీసు, లాటిరైట్, సున్నపురాయితోపాటు సిలికా తదితర ఖనిజాలు చైనా సహా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
Next Story

