Sat Jul 19 2025 23:41:13 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ అసిస్టెంట్ అంటూ ఫోన్ వచ్చింది.. తీరా!!
ప్రభాస్ అసిస్టెంట్ అంటూ ఓ వ్యక్తి తమకు ఫోన్ చేశారని ఫిష్ వెంకట్ భార్య తెలిపారు.

ప్రభాస్ అసిస్టెంట్ అంటూ ఓ వ్యక్తి తమకు ఫోన్ చేశారని ఫిష్ వెంకట్ భార్య తెలిపారు. ప్రభాస్ అసిస్టెంట్ ను మాట్లాడుతున్న అని ఫోన్ చేసింది వాస్తవమని, కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ కు సంబంధించి మిగిలిన విషయాలు సిద్ధం చేసుకోండి, ప్రభాస్ సార్ ఖర్చు భరిస్తారని చెప్పారన్నారు. రెండు రోజుల తరువాత అదే నంబర్ కు ఫోన్ చేస్తుంటే, స్విచ్ ఆఫ్ వస్తోందని, ఒకవేళ రింగ్ అయి ఫోన్ లిఫ్ట్ చేస్తే రాంగ్ నంబర్ అని చెబుతున్నారని ఆమె వాపోయింది.
ఫిష్ వెంకట్ కిడ్నీ లు ఇప్పటికే పాడవ్వడంతో డయాలసిస్ చేయిస్తూ వచ్చారు. పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ మార్పిడి చేయించాలని వైద్యులు నిర్ధారించారు. తమ దగ్గర ఆర్ధిక స్థోమత లేదని, సినీ పరిశ్రమ ఆదుకోవాలని వెంకట్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Next Story