మీ పాన్ కార్డు వాడి ఇంకెవరో లోన్ తీసుకుంటే.. తెలిసేదెలా?
మీ పాన్ కార్డు మీద లోన్ ఎవరైనా తీసుకున్నారంటే అది మిమ్మల్ని మరింత చిక్కుల్లోకి పడేస్తుంది.

మీ పాన్ కార్డు మీద లోన్ ఎవరైనా తీసుకున్నారంటే అది మిమ్మల్ని మరింత చిక్కుల్లోకి పడేస్తుంది.మీ పాన్ వివరాలతో రుణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ముందుగా క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించాలి. పలు క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా క్రెడిట్ రిపోర్ట్‌ను జారీ చేస్తాయి. ఇందులో మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు లావాదేవీల వివరాలు ఉంటాయి. మీ పేరు మీద ఏవైనా రుణాలున్నట్లు కనబడితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. బ్యాంక్ మేనేజర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి, తీసుకున్న లోన్ మీకు సంబంధించినది కాదని వివరించండి. ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్‌కు కూడా ఇ-మెయిల్ చేయాలి. మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నంబర్ దుర్వినియోగానికి గురై ఉండే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ రిపోర్టులో ‘హార్డ్ ఎంక్వైరీ’లు ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి.

