Fri Jan 30 2026 23:53:22 GMT+0000 (Coordinated Universal Time)
టీచర్ మీద కోపంతో.. బాంబు పెట్టి పేల్చేశారు...!!!
పిల్లలూ..జల్లలూ చల్లని వారే...కల్ల కపటమెరుగనీ కరుణామయులే...

1.పిల్లలూ..జల్లలూ చల్లని వారే...కల్ల కపటమెరుగనీ కరుణామయులే....!!!
2. పిల్లలూ...పిడుగులూ...
ఈ రెండూ పిల్లలను గురించిన నానుడులు...!!
సరిగ్గా రెండో పాయింట్ లో పేర్కోన్న విధంగా...ఒక వింత సంఘటన ఒకటి హరియాణాలో జరిగింది..
వివరాల్లోకి వెళితే....హరియాణా లోని 12 వ తరగతి విద్యార్ధులకు చదువు చెప్పే ఓ సైన్స్ టీచర్...ఏదో విషయమై విద్యార్థులను కోపగించడమో,తిట్టడమో చేశారు..!!
ఇది మనసులో పెట్టుకొన్న విద్యార్థులు...,టీచర్ మీద ఫ్రాంక్ చేయడానికి సిద్ధమయ్యారు..!!
దానికి అనుగుణంగానే, యూట్యూబ్ లో చూసి ఒక బాంబు తయారు చేసారు..!!
అనుకున్న విధంగానే, టీచర్ కుర్చీ కింద పెట్టి పేల్చేశారు.. కాకపోతే రిమోట్ కంట్రోల్ తో !!!
విషయం తెలుసుకున్న ఆ స్కూల్ ప్రిన్సిపాల్,ఆ విద్యార్దులను సస్పెండ్ చేశారు,కానీ ఆ టీచర్ పిల్లలను క్షమించడంతో వదిలిపెట్టారు...!!!
Next Story

