23 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు.. అమ్మ ఉంటుందనుకుంటే!!
మానసిక స్థితి సరిగా లేక చిన్నప్పుడు వెళ్ళిపోయి, 23 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు.

మానసిక స్థితి సరిగా లేక చిన్నప్పుడు వెళ్ళిపోయి, 23 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఇప్పుడు అతడి వయసు 40 సంవత్సరాలు. అతడు తిరిగొచ్చు చూడగా తల్లి, తమ్ముడు కూడా మృతి చెందారు. ఇద్దరు అక్కలు, బావలు అతడిని దగ్గరకు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బి. చించోలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొత్తపాటి నడిపి లింగన్న, మల్లవ్వ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉండేవారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమార్తెల వివాహాలు చేశాక లింగన్న ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. 1993 తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు. మల్లయ్య ఎనిమిదో తరగతి మధ్యలో చదువు మానేశాడు. 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2002లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 2021లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ సభ్యులకు మల్లయ్య కేరళలో కనిపించాడు. ముంబయిలోని ఆ సంస్థ ఆసుపత్రిలో నాలుగేళ్లపాటు మానసిక వైద్యం చేయించారు. అతడి మానసికస్థితి కొంత కుదుటపడడంతో ఊరు పేరు చెప్పాడు. దీంతో సంస్థ ప్రతినిధులు మల్లయ్యను తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆరేళ్ల కిందట తల్లి మల్లవ్వ, ఏడాది క్రితం తమ్ముడు రాజు మృతి చెందారని తెలుసుకుని మల్లయ్య బాధపడ్డాడు.

