Fri Dec 05 2025 08:45:21 GMT+0000 (Coordinated Universal Time)
హెయిర్ క్లిప్పు, కత్తితో ప్లాట్‌ఫాంపైనే ప్రసవం
రైలులో వెళుతున్న గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఓ యువ ఆర్మీ వైద్యుడు హెయిర్ క్లిప్పు, పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్‌ఫాం మీద ప్రసవం చేశారు.

రైలులో వెళుతున్న గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఓ యువ ఆర్మీ వైద్యుడు హెయిర్ క్లిప్పు, పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్‌ఫాం మీద ప్రసవం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో ఈ ఘటన జరిగింది. పన్వేల్ నుంచి గోరఖ్‌పుర్‌కు రైలులో వెళ్తున్న గర్భిణిని అత్యవసర వైద్యసాయం కోసం ఝాన్సీ స్టేషనులో దించారు. అదే సమయంలో హైదరాబాద్‌కు వెళ్లేందుకు మరో రైలు కోసం ఎదురుచూస్తున్నారు ఆర్మీ వైద్యాధికారి మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా. గర్భిణి పరిస్థితిని గమనించిన ఆయన రైల్వే మహిళా సిబ్బంది, స్థానిక మహిళల సాయంతో గర్భిణికి ప్లాట్‌ఫాంపైనే సురక్షితంగా ప్రసవం చేశారు. పండంటి ఆడపిల్ల పుట్టింది. బొడ్డుతాడును బిగించడానికి హెయిర్ క్లిప్పు వాడారు.
Next Story

