Fri Dec 05 2025 12:41:53 GMT+0000 (Coordinated Universal Time)
గొప్ప మనసు 650 మందికి ఇన్సూరెన్స్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇటీవల ఆర్య నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో రాజు అనే ఓ స్టంట్ మాస్టర్ మరణించారు. ఈ ఘటన తర్వాత చిత్ర పరిశ్రమలో స్టంట్ మాస్టర్స్ సేఫ్టీ గురించి చర్చ జరుగుతూ ఉంది. తాజాగా అక్షయ్ కుమార్ దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 650-700 మంది స్టంట్ మాస్టర్స్‌కి వ్యక్తిగత ఇన్స్యూరెన్స్ సదుపాయం అందించారు. ఈ ఇన్స్యూ రెన్స్‌లో భాగంగా ఆరోగ్య సమస్యలకు 5 లక్షల రూపాయలు, మరణించిన సందర్భంలో కుటుంబానికి 20-25 లక్షల వరకూ భద్రత కల్పించే పాలసీని ఏర్పాటు చేశారు. ఈ పాలసీని యాక్షన్ డైరెక్టర్స్ గిల్డ్, స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ సమన్వయంతో అమలు చేయనున్నారు.
Next Story

