జీమెయిల్ యూజర్లు ఇక మార్చేసుకోండి!!
జీ-మెయిల్ యూజర్లు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆప్షన్‌ను గూగుల్ తీసుకొచ్చింది.

జీ-మెయిల్ యూజర్లు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆప్షన్‌ను గూగుల్ తీసుకొచ్చింది. జీ-మెయిల్ ఐడీని మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గతంలో అవగాహన లేకనో, పేర్లు అందుబాటులో లేకనో ఏదో ఒక యూజర్ ఐడీతో కొందరు మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకుని ఉంటారు. చాలా సందర్భాల్లో అదే మెయిల్ ఐడీని ఇచ్చేసి ఉంటారు. ఆ తర్వాత దాన్ని మార్చుకుందామంటే కుదరదు. దీంతో కొత్తగా ఇ-మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. పాత డేటా కోల్పోవడం ఇష్టం లేనివారు చాలా మంది దాన్నే వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇ-మెయిల్ ఐడీని మార్చుకునే వెసులుబాటును గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ ఉంటుంది. చివర్లో @జీమెయిల్.కామ్ అలానే ఉంటూ అడ్రస్‌ను మార్చుకోవచ్చు. కొత్త ఇ-మెయిల్ ఐడీని ఎంచుకున్నప్పటికీ, దాన్ని పాత అకౌంట్‌గానే గూగుల్ పరిగణిస్తుంది. ఇకపై జీమెయిల్‌కూ రెండు యూజర్‌నేమ్‌లు ఉంటాయి.

