Fri Jan 30 2026 05:39:48 GMT+0000 (Coordinated Universal Time)
అంతరిక్షం నుంచి గంగా నది డెల్టా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత్లోని గంగా నది డెల్టా ప్రాంతం ఆకట్టుకుంటూ ఉంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత్లోని గంగా నది డెల్టా ప్రాంతం ఆకట్టుకుంటూ ఉంది. నాసా వ్యోమగామి డాన్ పెటిట్ అందుకు సంబంధించిన ఫోటోను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. డాన్ పెటిట్ నియర్–ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని బందించారు. నదులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంగా నది డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ డెల్టాగా గుర్తింపు పొందింది. తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్లో విస్తరించి ఉంది. దీన్ని గంగా–బ్రహ్మపుత్ర డెల్టా లేదా బెంగాల్ డెల్టా లేదా సుందర్బన్స్ డెల్టా అని కూడా అంటారు. విస్తీర్ణం లక్ష చదరపు కిలోమీటర్లకు పైమాటే. ఎంతో మందికి జీవనాధారం ఈ ప్రాంతం.
News Summary - Ganges River Delta from space
Next Story

