కొడుకు కోసం.. సైకిల్‌ను బైక్‌లా మార్చిన తండ్రి
తన తోటి పిల్లలు స్కూటీలు, బైక్‌లపై స్కూలుకు వస్తుంటే ఓ కుర్రాడు.. తాను కూడా అలా వెళ్లాలని అనుకున్నాడు.

తన తోటి పిల్లలు స్కూటీలు, బైక్‌లపై స్కూలుకు వస్తుంటే ఓ కుర్రాడు.. తాను కూడా అలా వెళ్లాలని అనుకున్నాడు. అదే విషయాన్ని తండ్రికి చెప్పాడు. అయితే బైక్‌ను కొనేందుకు ఆ తండ్రి దగ్గర డబ్బులు లేవు. కానీ తన కుమారుడిని బైక్‌పై స్కూలుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒడిశాలోని కటక్‌లో ఉన్న రాజేంద్ర నగర్‌కు చెందిన శిబ కుమార్ సాహూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు.
ఒక గ్యాస్ స్టవ్ దుకాణంలో మెకానిక్‌గా శిబ కుమార్ సాహూ పనిచేస్తున్నాడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రోజులు వెళ్లదీస్తున్నాడు. బైక్‌పై స్కూలు దగ్గర దింపొచ్చుగా అని కుమారుడు చెప్పిన మాటలు శిబ కుమార్ సాహూను ఆలోచింపజేశాయి. తన కొడుకు కోరికను తీర్చేందుకు తన సైకిల్‌నే బైక్‌లా మార్చేశాడు. చాలా భాగాలు, పరికరాలను పాత ఇనుప సామాన్ల దుకాణాల నుంచి సేకరించాడు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్, సీట్, హ్యాండిల్ బార్, హెడ్ లైట్, స్పీడో మీటర్లను ఆటో పార్ట్స్ దుకాణాల్లో కొన్నాడు. 45 రోజుల తర్వాత శిబ కుమార్ సైకిల్ కాస్తా హీరో హోండా సీడీ 100లా మారిపోయింది. ఇది చూసి అతడి కొడుకు ఎంతో ఆనందించాడట.

