Tue Mar 17 2026 10:41:36 GMT+0530 (India Standard Time)
హాంకాంగ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315లో మంటలు చెలరేగాయి.

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315లో మంటలు చెలరేగాయి. పవర్ యూనిట్లో మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికి యాక్సిలరీ విద్యుత్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండ్ అయిన కాసేపటికి పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయని ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా దిగారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది.
Next Story

