Wed Jan 28 2026 20:48:51 GMT+0000 (Coordinated Universal Time)
Spider Man: స్పైడర్ మ్యాన్ కి భారీ ఫైన్ వేసిన పోలీసులు

ఢిల్లీలోని ద్వారకలో స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ ధరించిన ఓ వ్యక్తి కారు బానెట్ మీద వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కారు రాంఫాల్ చౌక్ సమీపంలో ఉంది. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తిని నజఫ్‌గఢ్ నివాసి 20 ఏళ్ల ఆదిత్యగా గుర్తించారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని మహావీర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే 19 ఏళ్ల గౌరవ్ సింగ్‌గా గుర్తించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడపడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి నిబంధనలు పాటించలేదని వాహన యజమాని, డ్రైవర్‌పై పోలీసులు అభియోగాలు మోపారు.
నిందితులు గరిష్టంగా రూ. 26,000 జరిమానా లేదా జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. స్కార్పియో కారుపై స్టంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఫిర్యాదు అందడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సహించబోమని పోలీసులు తెలిపారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ లేదా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఏవైనా సంఘటనలను చూసిన వెంటనే తమకు నివేదించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పౌరులను కోరుతున్నారు.
Next Story

