దుల్కర్ సల్మాన్ కారు స్వాధీనం
ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌కు చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.

ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌కు చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఈ కారును కొచ్చిలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. 2012 మోడల్ వాహనం ఇప్పటికే మూడుసార్లు చేతులు మారగా, ప్రస్తుతం దుల్కర్ మూడో యజమానిగా ఉన్నట్లు సమాచారం. విలాసవంతమైన కార్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఒక పెద్ద కుంభకోణంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు కేరళ రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. కొచ్చి సమీపంలోని మమ్ముట్టి పాత నివాసంలో పార్క్ చేసి ఉన్న ఎనిమిది లగ్జరీ కార్లను కూడా తనిఖీ చేశారు. భూటాన్ మార్గంలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు పన్నులు ఎగవేస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వాహనాలను మొదట హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ చేసి, ఆ తర్వాత నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.

