ఓఆర్ఎస్ పేరు పెట్టొద్దు
ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలు తమ ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులను ఓఆర్ఎస్ పేరుతో అమ్మరాదంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.

ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలు తమ ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులను ఓఆర్ఎస్ పేరుతో అమ్మరాదంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అనే పదాన్ని రాయొద్దని ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్న ఈ పద్ధతిని నిషేధిస్తూ, ఫుడ్ ప్రొడక్ట్ బ్రాండ్ పేరులో గానీ, ట్రేడ్ మార్క్ లో గానీ ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడటం ఇకపై చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. డీహైడ్రేషన్ సమస్య నివారణ కోసం మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో అనేక డ్రింకులు అందుబాటులో ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ఫార్ములాతో తయారైనదే అసలైన ఓఆర్ఎస్. కానీ పలు కంపెనీలు తమ పండ్ల రసాలు, రెడీ -టు -డ్రింక్ పానీయాలకు ఓఆర్ఎస్ అనే పదాన్ని ముందుగానీ, వెనుకగానీ తగిలించి వినియోగదారులను మోసం చేస్తున్నాయి.

