Fri Dec 05 2025 19:40:05 GMT+0000 (Coordinated Universal Time)
సిరాజ్ ముద్దు పేరు ఏంటో తెలుసా?
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఓ ముద్దుపేరు పెట్టింది.

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఓ ముద్దుపేరు పెట్టింది. మైదానంలో అతని దూకుడైన ప్రవర్తన, ఉద్వేగభరితమైన ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్‌లో సిరాజ్‌ను ‘మిస్టర్ యాంగ్రీ’ అని పిలుచుకుంటున్నారట. ఈ విషయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ తెలిపారు. ‘డైలీ మెయిల్’ పత్రికకు రాసిన తన కాలమ్‌లో నాసిర్ హుస్సేన్ ఈ విషయాన్ని బయట పెట్టారు. సిరీస్ మొత్తం మీద 9 ఇన్నింగ్స్‌లలో 23 వికెట్లు పడగొట్టి, సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవల్ టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్‌కు 6 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
News Summary - Do you know what Siraj's nickname is?
Next Story

