Fri Dec 05 2025 12:58:35 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ రెస్టారెంట్.. వారికి నో ఎంట్రీ
ఢిల్లీలో ఓ జంటకు రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో అక్కడకు వెళ్లిన ఆ జంటకు సిబ్బంది అనుమతి నిరాకరించారు.

ఢిల్లీలో ఓ జంటకు రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో అక్కడకు వెళ్లిన ఆ జంటకు సిబ్బంది అనుమతి నిరాకరించారు. పీతంపురలోని ఓ రెస్టారంట్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ రెస్టారంట్లోకి ఇతరులను అనుమతించగా.. తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. ఢిల్లీ
సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారని మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. ఈ వ్యవహారంపై రెస్టారంట్ యజమాని నీరజ్ అగర్వాల్ స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని వివరణ ఇచ్చారు.
Next Story

