Sat Dec 13 2025 19:28:59 GMT+0000 (Coordinated Universal Time)
బీఎస్ఎఫ్ తొలి మహిళాఫ్లైట్ ఇంజనీర్‌గా
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు. బీఎస్ఎఫ్లో విమాన విభాగం 1969లో ఏర్పాటు కాగా, ఇంజినీరు పదవిలో మహిళను నియమించడం ఇదే మొదటిసారి. నలుగురు పురుషులతో పాటు శిక్షణ పొందిన భావనకు ఇటీవలే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ఫ్లయింగ్ బ్యాడ్జెస్‌ను అందజేశారు. ఆగస్టులో ప్రారంభమైన రెండు నెలల అంతర్గత శిక్షణలో ఐదుగురు సిబ్బందికి 130 గంటల పాటు నైపుణ్యం అందించారు. శిక్షణ సమయంలో, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో ఇటీవల సంభవించిన వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొనడం ద్వారా వీరు బీఎస్ఎఫ్ వైమానిక విభాగంలోని వివిధ విమానాలపై అనుభవం పొందారు. అలా భావనా చౌదరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా నియమితులయ్యారు.
Next Story

