Sun Mar 15 2026 19:19:51 GMT+0530 (India Standard Time)
భారత్ ను వీడిన బ్రిటన్ యుద్ధ విమానం
బ్రిటన్ కు చెందిన ఎఫ్ -35 యుద్ధ విమానం సాంకేతిక సమస్యతో కేరళ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయింది.

బ్రిటన్ కు చెందిన ఎఫ్ -35 యుద్ధ విమానం సాంకేతిక సమస్యతో కేరళ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయింది. బ్రిటన్ నుంచి నిపుణులను రప్పించి మరమ్మతులు చేయించారు. ఐదు వారాలుగా తిరువనంతపురం విమానాశ్రయంలోనే ఉండగా, ఎట్టకేలకు సమస్యను గుర్తించి మరమ్మతులు చేయడంతో యుద్ధ విమానం గాల్లోకి ఎగిరింది. హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా పైలట్ ఈ విమానాన్ని జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. కొన్ని రోజుల పాటు రన్ వే పైనే ఉన్న ఈ విమానం తర్వాత విమానాశ్రయం షెడ్డుకు చేరింది.
Next Story

