Sun Dec 14 2025 19:34:00 GMT+0000 (Coordinated Universal Time)
విమానాన్ని ఆపేసిన తేనెటీగలు
తేనెటీగల కారణంగా విమానం ఎగరడం దాదాపు గంట ఆలస్యమైంది

తేనెటీగల కారణంగా విమానం ఎగరడం దాదాపు గంట ఆలస్యమైంది.ఇండిగో ఎయిర్‌బస్ A320 విమానం సోమవారం సాయంత్రం సూరత్ నుంచి జైపూర్ వెళ్లాల్సి ఉంది. సాయంత్రం 4:20 గంటలకు షెడ్యూల్ చేశారు. ఇక ప్రయాణికులంతా విమానంలో ఎక్కి కూర్చున్నారు. గ్రౌండ్ సిబ్బంది ప్రయాణికుల లగేజ్‌ని విమానంలోకి ఎక్కిస్తూ ఉండగా తేనెటీగలు కనిపించాయి. లగేజ్ లోడ్ చేసే డోర్ దగ్గర తేనెటీగల గుంపు ఒక్కసారిగా పైకి లేచింది. దీంతో అప్రమత్తమై విమానం టేకాఫ్‌ను ఆపేశారు. తేనెటీగలు చెదరగొట్టేందుకు పొగ కూడా పెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది విమానం వద్దకు చేరుకొని తేనెటీగలు ఉన్న లగేజ్ డోర్‌పై నీళ్లు చల్లడంతో అవి ఎగిరిపోయాయి. అలా విమానం దాదాపు గంట ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది.
Next Story

