బీ కేర్ ఫుల్.. ఉద్యోగం లేకుండా చేసిన సిబిల్ స్కోర్
మీకు ఉద్యోగాలు రావాలంటే సిబిల్ స్కోర్ కూడా ఉండాల్సిందే!!

మీకు ఉద్యోగాలు రావాలంటే సిబిల్ స్కోర్ కూడా ఉండాల్సిందే!! క్రెడిట్ కార్డు బకాయిలు, వ్యక్తిగత రుణాలు చెల్లించకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఒక వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది.
ఎస్బీఐ నిర్వహించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుకు ఒక అభ్యర్థి ఎంపికయ్యారు. సదరు వ్యక్తి పలు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించలేదని, ఫలితంగా ఆయన సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. బ్యాంకు నిబంధనలకు ఇది విరుద్ధమని భావించి నియామకాన్ని రద్దు చేశారు. ఆ అభ్యర్థి బ్యాంకు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాధనాన్ని నిర్వహించే కీలకమైన బాధ్యతల్లోకి వచ్చేవారికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత అవసరమని, దరఖాస్తు నిబంధనల్లో సిబిల్ స్కోర్ స్పష్టంగా ఉండాలని ముందే చెప్పారని కోర్టు అభిప్రాయపడింది. రుణాలు సరిగ్గా చెల్లించని వారిపై నమ్మకం ఎలా ఏర్పడుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. అభ్యర్థి పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం, నియామకాన్ని రద్దు చేస్తూ ఎస్బీఐ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటవుతాయని తీర్పు ఇచ్చింది.

