ఆ వీడియో రికార్డు చేసినప్పటి నుండి షాక్‌లోనే ఆర్యన్
జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద దృశ్యాలను ఓ బాలుడు చిత్రీకరించాడు.

జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద దృశ్యాలను ఓ బాలుడు చిత్రీకరించాడు. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మిద్దె పైనుంచి సెల్‌ఫోనుతో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు ఆర్యన్. అనుకోకుండా అతడు చూసిన ఘోర ప్రమాదం షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. గుజరాత్‌లోని అరవల్లీ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో బాలుడి కుటుంబం నివసిస్తోంది. భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తండ్రి అహ్మదాబాద్ మెట్రోలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో ఉన్నారు.
విమానాశ్రయం పక్కనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. 11వ తరగతి పూర్తిచేసుకొన్న ఆర్యన్ కొత్త పుస్తకాలు కొనేందుకు అహ్మదాబాద్‌కు వచ్చాడు. తండ్రి ఉంటున్న ఇంటి వద్దకు చేరుకొన్నాక, అదే సమయంలో బాగా కింది నుంచి వెళుతున్న ఎయిరిండియా విమానాన్ని చూసి మిద్దెపైకి వెళ్లి సెల్‌ఫోనుతో వీడియో తీశాడు. అయితే పెద్దఎత్తున మంటలు చెలరేగి, అతడి కళ్ల ముందే ఘోర ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలను తండ్రికి పంపగా, శరవేగంతో వీడియో వైరల్ అయింది. క్రైం బ్రాంచ్ పోలీసులు తండ్రి సమక్షంలో బాలుడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.